శోభాయాత్ర | - | Sakshi
Sakshi News home page

శోభాయాత్ర

Sep 6 2025 5:33 AM | Updated on Sep 6 2025 5:33 AM

శోభాయ

శోభాయాత్ర

ఆకట్టుకుంటున్న వినాయకులు

శోభాయాత్రకు భారీ భద్రత

ప్రారంభమైన

శోభాయాత్రను ప్రారంభించిన కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ రాజేష్‌ చంద్ర

నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు

భారీగా తరలివచ్చిన ప్రజలు

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవ శోభాయాత్ర శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ధర్శశాల వద్ద యువజన సమాఖ్య వినాయకుడికి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ రాజేష్‌ చంద్రలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్‌, ఎస్పీలు జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి పట్టణవాసులతో పాటు సమీప గ్రామాల నుంచి భక్తజనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సుభాష్‌ రోడ్‌, జేపీఎన్‌ రోడ్‌, సిరిసిల్ల రోడ్‌, మాయాబజార్‌, పాంచ్‌రస్తా, పెద్దబజార్‌, పాత పట్టణంలో జనంతో రద్దీగా మారింది. సుమారు 400లకు పైగా విగ్రహాలను జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించారు. భారీ విగ్రహాలను ట్రాక్టర్‌లలో ఎక్కించడానికి మున్సిపల్‌ నుంచి భారీ క్రేన్‌లను తెప్పించారు. రెండు రోజుల పాటు ఈ శోభాయాత్ర సాగనుంది. టేక్రియాల్‌లో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందిరాచౌక్‌ వద్ద వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు.

శోభాయాత్రలో భారీ విగ్రహాలతో పాటు వివి ధ రూపాల్లో వినాయకులు ఆకట్టుకుంటున్నా యి. వాహనాలను విద్యుత్‌ దీపాలు, పూలతో అలంకరించారు. నాసిక్‌ ఢోల్‌, డప్పులు, డోలు చప్పుల మధ్య వినాయకులను తరలించారు. రెండు రోజుల పాటు ఘనంగా నిమజ్జనోత్స వం సాగుతుంది.

జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు సాగే వినాయక నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేష్‌ చంద్ర పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గణేశ్‌ విగ్రహాల ఊరేగింపు నిర్వహించే వాహనాలను అందంగా అలంకరించారు. డప్పు చప్పుళ్లు, యువకులు, చిన్నారుల నృత్యాల మధ్య శోభాయాత్ర కోలాహలంగా సాగింది. రోడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శోభాయాత్ర మార్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

శోభాయాత్ర1
1/3

శోభాయాత్ర

శోభాయాత్ర2
2/3

శోభాయాత్ర

శోభాయాత్ర3
3/3

శోభాయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement