
రైతులు కెపాసిటర్లు అమర్చుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు పొలాల్లో కెపాసిటర్లు అమర్చుకోవాలని, అవసరం ఉన్నవారు వాటికోసం దరఖాస్తు చేసుకోవాలని ట్రాన్స్‌కో డీఈ విజయసారథి అన్నారు. ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదన్నారు. మండలంలోని కోమట్‌పల్లి గ్రామంలో శనివారం ట్రాన్స్‌కో అధికారులు పొలంబాట కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా పంటచేనుల్లో లూజ్ వైర్ లైన్లు, వంగిన పోల్స్‌ను సరిచేసినట్లు ఆయన తెలిపారు. అలాగే రైతులతో మాట్లాడారు. గ్రామంలో వినాయక ఉత్సవాల సందర్భంగా మండపాల్లో కరెంటు విషయంలో జాగ్రత్తలు పాటించాలని యువకులకు సూచించారు. ఏడీఏ మల్లేశం, సిబ్బంది అనిల్‌కుమార్, మల్లయ్య, రాజు, పోశెట్టి, రాజు, రైతులు ప్రవీత్ పంతులు, శ్రీను, భీమయ్య, కళ్యాణ్, విఠల్, సాయిలు, హరీష్, కమ్లీ పాల్గొన్నారు.
విద్యుత్ లైన్లను సరిచేస్తున్నాం..
కామారెడ్డి అర్బన్: విద్యుత్ అధికారుల పొలంబాట లో ఇప్పటివరకు 1425 వదులుగా ఉన్న లైన్లను సరిచేశామని, 1384 వంగిపోయిన స్తంభాలు సరిచేసి వాటి మధ్యలో 1631 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు ఎన్‌పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో తక్కువ ఎత్తులో ఉన్న 161 లైన్ క్రాసింగ్, 84 డీటీఆర్ ప్లింత్‌లు, 95 డబుల్ ఫీడింగ్ పాయింట్లను మార్చినట్టు పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వినియోగదారులు సమస్యలు వచ్చినప్పుడు విద్యుత్‌శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు సంప్రదించాలని సూచించారు.