
ఆధునిక పద్ధతుల్లో బోధించాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): ఉపాధ్యాయులు ఆధునిక పద్ధతుల్లో బోధన సామగ్రిని వినియోగిస్తూ పాఠా లు బోధించాలని ఎంఈవో ప్రవీణ్‌కుమార్ అన్నా రు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో శనివారం బోధన అభ్యసన సామగ్రి (టీ చింగ్ లర్నింగ్ మెటీరియల్–టీఎల్‌ఎం) మేళా నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ తమ సామగ్రిని ప్రదర్శించారు. తహసీల్దార్ దశరథ్, జగదీష్, కిషోర్, హెచ్‌ఎం కమల, వల్లభరావు పాల్గొన్నారు.
టీఎల్‌ఎం మేళాతో బోధన సులభతరం
కామారెడ్డి రూరల్: విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి ఉపాధ్యాయ బోధనోపకరణాలు ఎంతో ఉపయోగపడుతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో ఎల్లయ్య అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం మండలస్థాయి టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేళాలో ప్రతిభ కనబర్చిన వాటిని జిల్లాస్థాయిలో కూడా ప్రదర్శించి మొదటి బహుమతి వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అర్చన్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ యూనియన్, టీపీటీఎఫ్, తపస్ తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక పద్ధతుల్లో బోధించాలి