
బైక్ పైనుంచి పడి గాయాలు
ఎల్లారెడ్డి: పట్టణ శివారులో బైక్ పైనుంచి పడిన యువకుడికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు శనివారం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని పోచాపూర్ గ్రామానికి చెందిన పండరి బైక్‌పై ఎల్లారెడ్డికి వస్తుండగా పట్టణ శివారులో రోడ్డుపై ఉన్న గుంతలో పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
‘సాగర్’లో యువకుడి గల్లంతు
నిజాంసాగర్(జుక్కల్): పిట్లం మండలం అల్లాపూర్ గ్రామానికి చెందని గైని పండరి (30) శనివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులో గల్లంతయ్యాడని ఎస్సై శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు సందర్శన కోసం ద్విచక్ర వాహనంపై వచ్చిన పండరి గుల్‌దస్త్రా వద్ద జలాశయంలోకి దూకినట్లు పేర్కొన్నారు. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బైక్ పైనుంచి పడి గాయాలు