సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌

Aug 24 2025 8:27 AM | Updated on Aug 24 2025 8:27 AM

సోషల్

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌

భిక్కనూరు: తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌లోని సోషల్‌వర్క్‌ డిపార్ట్‌మెంట్‌లో రీ సెర్చ్‌ స్కాలర్‌ ప్రగతికి శనివారం డాక్టరేట్‌ ప్ర దానం చేశారు. రీసెర్చ్‌ సూపర్‌వైజర్‌ డాక్టర్‌ రాజేశ్వరీ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్‌ ఆటిట్యూడ్‌ ఎమాంగ్‌ స్టూడెంట్స్‌ టువర్డ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కేరీర్‌ ప్లానింగ్‌ ఇన్‌ కేజీబీవీస్‌ నిజామాబాద్‌’ అనే అంశంపై సీహెచ్‌. ప్రగతి పరిశోధన చేసింది. ప్రగతి నిజామాబాద్‌ సోషల్‌ వేల్ఫేర్‌ గురుకుల కళాశాలలో జువాలజీ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తోంది. కార్యక్రమంలో ఓయూ సీనియర్‌ ప్రొఫెసర్‌ ఫ్రాన్సిస్‌, తెయూ సోషల్‌ సైన్సెస్‌ డీన ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌, సోషల్‌వర్క్‌ హెచ్‌వోడీ అంజయ్య, గైడ్‌ సూపర్‌వైజర్‌ రాజేశ్వరీ పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

బిచ్కుంద: మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో గత ఎన్నో ఏళ్ల నుంచి మరుగుదొడ్లు లేక విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. దీంతో సాక్షి దినపత్రికలో ఇటీవల ‘మూడొందల మందికి ఒకే టాయిలెట్‌’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ స్పందించారు. పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య వెంటనే పరిష్కరించాలని ఎంపీ లాడ్స్‌ నిధులు మంజూరు చేశారు. 10 మరుగుదొడ్లకు రూ.6.90 లక్షలు నిధులు మంజూరు చేస్తూ కలెక్టర్‌ ప్రొసీడింగ్‌ జారీ చేశారు. పనులు ప్రారంభించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరానికి కృషి చేసిన జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కార్‌, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, సాక్షి దినపత్రికకు విద్యార్థులు, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

లైంగిక వేధింపుల

నివారణకు కృషిచేయాలి

కామారెడ్డి టౌన్‌: పిల్లలు, మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌, వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ సూచించారు. పట్టణంలోని జిల్లాకోర్టులో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల నుంచి పిల్లల హక్కులు–రక్షణ అనే అంశంపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. పోక్సో చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. న్యాయమూర్తి సుమలత, ఏఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా శిశు సంరక్షణ అధికారిణి స్రవంతి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శేషు, సఖీ సెంటర్‌ ఇన్‌చార్జి కవిత, భరోసా కో–ఆర్డినేటర్‌, కవిత, చంద్రసేన్‌ రెడ్డి, ఖాజా పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలి

కామారెడ్డి టౌన్‌: ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని అధ్యాపకులు అన్నారు. పట్టణంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాల, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. కళాశాల సీఈవో జైపాల్‌రెడ్డి అన్నారు. డీన్‌ నవీన్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌లు గోవర్ధన్‌రెడ్డి, గంగాధర్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌ 1
1/4

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌ 2
2/4

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌ 3
3/4

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌ 4
4/4

సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement