
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
సాక్షి నెట్‌వర్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా తహసీల్ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 నగదు, రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం రూ.15వేలు, యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగభృతి అందజేయాలని డిమాండ్ చేశారు. వారసత్వం ద్వారా వచ్చే భూములను రిజిస్ట్రేషన్ చేయాలని, అర్హులైన వారికి ఫ్యామిలీ సర్టిఫికెట్లను ఇప్పించాలని కోరారు. అదే విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను ప్రతి సొసైటీలో అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి