జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య

Aug 23 2025 2:04 AM | Updated on Aug 23 2025 2:04 AM

జంగంప

జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య

జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య బస్టాండ్‌ క్యాంటీన్‌లో కూలిన పైకప్పు పాఠశాలకు నోటీసులు జారీ కోతుల దాడిలో ఒకరికి గాయాలు మూడేళ్లకు దొరికిన బైక్‌

భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ (32) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో శుక్రవారం వేకువజామున అతడు బయటకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి, బైక్‌పై బయలుదేరాడు. జంగంపల్లి చెరువు సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ప్రత్యూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

బాన్సువాడ: బాన్సువాడ బస్టాండ్‌లో ఉన్న క్యాంటీన్‌ పైకప్పు శుక్రవారం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో క్యాంటీన్‌లో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్టాండ్‌ పురాతన భవనం కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు తడిసిపోయి కూలింది. పైకప్పు కూలిన శబ్దానికి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. క్యాంటీన్‌లో ఉన్న సామగ్రి పూర్తిగా దెబ్బతింది. ఆర్టీసీ అధికారులు శిథిలావస్థకు చేరిన బస్టాండ్‌కు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

పెర్కిట్‌(ఆర్మూర్‌): పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలకు ఎంఈవో రాజ గంగారాం శుక్రవారం నోటీసులు జారీ చేశారు. టీసీల కోసం వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండటంతో నోటీసులు ఇచ్చినట్లు ఎంఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫీజుల విషయంలో గాని టీసీల విషయలో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బదులకు గురి చేస్తే పాఠశాల యాజమాన్యాలపై శాఖపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని కాటేపల్లి గ్రామంలో ఒకరిపై కోతులు దాడి చేసి గాయపర్చాయి. గ్రామానికి చెందిన సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ గంగాగౌడ్‌ శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లివస్తుండగా వస్తుండగా పాఠశాల సమీపంలో కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. వెంటనే పిట్లం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి భూపల్లి ప్రదీప్‌, స్థానిక ఆయుష్మాన్‌ ఆరోగ్యమందిర్‌ వైద్యుడు సాయిబాబా, ఏఎన్‌ఎం లక్ష్మి, ఆయనకు ఆరోగ్య సలహాలు అందించారు. కాంగ్రెస్‌ నాయకులు మల్లప్ప పటేల్‌ తదితరులు ఆయనను పరామర్శించారు.

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): హైదరాబాద్‌లో 2022లో పోయిన బైక్‌, మూడేళ్ల తర్వాత మండలంలో దొరికింది. ఎస్సై అరుణ్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా, ఓ బైక్‌పై నాన్‌ కాంటాక్ట్‌ చలాన్‌ వేశారు. దీంతో ఆ బైక్‌పై కేసు ఉన్నట్లు తెలిసింది. వెంటనే పోలీస్‌ సిబ్బంది ఆ బైక్‌ను వెతికి పట్టుకొని హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎస్సై అరుణ్‌ కుమార్‌ను అభినందించారు.

జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య
1
1/1

జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement