
తలసేమియా బాధితులకు రక్తదాన శిబిరం
ఘనంగా ఇలియాస్ జన్మదిన వేడుకలు
కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కుమారుడు మహమ్మద్ ఇలియాస్ జన్మదినం సందర్భంగా తలసేమియా బాధితుల సహాయార్థం శుక్రవారం జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యువకులు, కార్యకర్తలు 105 మంది రక్తదానం చేశారు. ఈ మేరకు రక్తదాతలను షబ్బీర్ అలీ, ఇలియాస్‌ను అభినందించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలు, నర్సింగ్‌రావు, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.

తలసేమియా బాధితులకు రక్తదాన శిబిరం