
బోధన్‌లో కలకలం రేపిన రేసింగ్ పావురం
బోధన్‌రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో కోడింగ్ స్టిక్కర్‌తో ఉన్న పావురం కలకలం రేపింది. మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఓ బాలుడు ఆడుకుంటుండగా పావురం దొరికింది. ఆ పావురం కాలికి, రెక్కలకు కోడింగ్ నెంబర్‌లతో ఉన్న స్టిక్కర్‌లు ఉన్నాయి. దీంతో ఆ పావురం గూఢచారి పావురం అంటూ ప్రచారం జరిగింది. గ్రామస్తులు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని పావురాన్ని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ తీసుకొచ్చారు. ఈ పావురం రేసింగ్ గేమ్‌కు సంబంధించినదని ఎస్సై తెలిపారు. పావురాన్ని పరిశీలించి వదిలేసినట్లు చెప్పారు. ఎటువంటి కేసు నమోదు చెయ్యలేదన్నారు. ఈ పావురం ఘటన మంగళవారం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామ శివారులో మంగళవారం వేకువజామున డీసీఎం వాహనం చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి పిట్లం వైపు వెళ్తున్న డీసీఎం ప్రధాన రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
రాజంపేట: బోధన అభ్యాస సామగ్రి(టీఎల్‌ఎం) ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించవచ్చని మండల విద్యాధికారి పూర్ణ చంద్ర రావ్ అన్నారు. మంగళవారం రాజంపేట బాలికల ఉన్నత పాఠశాలలో టీఎల్‌ఎమ్ మేళా నిర్వహించారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం అంశాల నుంచి ఉపాధ్యాయులు టీఎల్‌ఎంను తయారు చేసి ప్రదర్శించారు. బోధన అభ్యాస సామాగ్రి మేళాను స్థానిక తహసీల్దార్ జానకి సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలిచ్చారు. హెచ్‌ఎంలు విజయలక్ష్మి, ఈశ్వరయ్య, రమేష్, రెడ్య, కిషన్, కరుణశ్రీ, విజయలక్ష్మి, రీసోర్స్ పర్సన్‌లు ముదాం స్వామి, శ్రీధర్ గౌడ్, రాజేందర్, నిరూపమా రాణి, సీఆర్పీలు లింగం, సాయిరెడ్డి, రమేష్, సూర్యా పాల్ తదితరులు పాల్గొన్నారు.

బోధన్‌లో కలకలం రేపిన రేసింగ్ పావురం

బోధన్‌లో కలకలం రేపిన రేసింగ్ పావురం