కామారెడ్డి అర్బన్: స్థానిక శని శింగనపురం శనేశ్వరస్వామికి ఈనెల 23న పొలాల అమావాస్య సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి తైలాభిషేకం, సాయంత్రం దీపోత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శని బాధలు తొలిగించుకోవడానికి భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులందరూ సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) కమిటీ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి అన్నారు. ఎర్రాపహాడ్‌లోగల రెడ్డి సంఘం భవనంలో మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో రైతులకు ఏ సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి ఆ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఏడుగురు రైతులతో కమిటీని ఏర్పాటు చేసుకొని నెలనెలా సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే సంవత్సరానికి 4 రైతు పండుగలను జరుపుకోవాలని సూచించారు. నేతలు ఆనంద్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలోని సీతాయిపల్లి శివారులో మంగళవారం ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాలు ఇలా.. బాన్సువాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడకు బయలు దేరింది. కొండాపూర్– సీతాయిపల్లి గ్రామాల మధ్య బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈక్రమంలో రోడ్డుపై గుంతల కారణంగా బస్సు అదుపుతప్పి రోడ్డుకు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి, చెట్టు వద్ద నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను డ్రైవర్ డోర్ ద్వారా కిందికి దింపారు. ఘటన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులున్నట్లు స్థానికులు తెలిపారు.
23న శనేశ్వరుడికి అమావాస్య తైలాభిషేకం