
అందరికీ ‘సంక్షేమం’ బాధ్యత అధికారులదే
భిక్కనూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం భిక్కనూరు రైతు వేదికలో మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన ఉద్యోగుల విధులకు అటకం కలిగిస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. నిబంధనలను తుంగలో తొక్కాలని లొత్తిడి తీసుకువచ్చిన వారి భరతం పడతానని హెచ్చరించారు. డిసెంబర్ నాటికి తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించి రెండెళ్లు పూర్తి అవుతాయని, అప్పటిలోగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందకుంటే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, ఎంఈవో రాజ్‌గంగారెడ్డి, ఏఈ సంకీర్త్, ప్రభుత్వ వైద్యురాలు యెమీమా తదితరులు పాల్గొన్నారు.