
విద్యార్థులకు క్రీడాదుస్తుల వితరణ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోపాల్‌పేట హైస్కూల్‌లో 25మంది విద్యార్థులకు మంగళవారం స్థానిక ఎస్సై భార్గవ్‌గౌడ్ క్రీడాదుస్తులను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై భార్గవ్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నతస్థాయికి చేరాలన్నారు. హెచ్‌ఎం వెంకట్రాంరెడ్డి, పీడీ సభాత్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో టై, బెల్ట్‌లు..
భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం టై, బెల్ట్‌లను పంపిణీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శంకర్, ఉపాధ్యాక్షులు జైపాల్‌రెడ్డి,పొగ్రాం కో–ఆర్డినేటర్ పున్న రాజేశ్, సభ్యుడు సుధాకర్,హెచ్‌ఎం యాదగిరి, ఉపాధ్యాయులు నర్సింహరెడ్డి, ఉమారాణి, సురేశ్, అజ్జులు పాల్గొన్నారు.
23న ఎల్లారెడ్డికి
మందకృష్ణ మాదిగ రాక
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డికి ఈనెల 23న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ రానున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సామెల్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక సంఖ్యలో పెన్షన్ దారులు హాజరు కావాలని కోరారు. నాయకులు పద్మారావు తదితరులున్నారు.

విద్యార్థులకు క్రీడాదుస్తుల వితరణ