
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తాం
గాంధారి(ఎల్లారెడ్డి) : నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అన్నారు. గండివేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని వారు ఆందోళన చెందరాదన్నారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి బేస్‌మెట్ లెవెల్ పనులు పూర్తయిన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయన్నారు. అనంతరం గండివేట్ తండాలో నిర్వహించిన తీజ్‌వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయనతో పాటు మండల పరిధిలోని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలున్నారు.
కామారెడ్డిలో బంజారా సంఘం
ఏర్పాటుకు కృషి చేస్తా
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బంజారా సంఘం భవనం ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షణ్ హాల్‌లో నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్రావణమాసంలో గిరిజన మహిళలు ఉపవాస దీక్షలు చేసి గోధుమ బుట్టలను పూజించడం జరుగుతుందన్నారు. నాగిరెడ్డిపేటలో బంజారా భవనం ఏర్పాటు చేస్తానని అన్నారు. అనంతరం బంజారా సంఘం నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు, మహిళలు గోధుమ బుట్టలతో పట్టణంలో అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్, జిల్లా అధ్యక్షులు సురేందర్‌నాయక్, మోతిసింగ్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట బంజారా సంఘం అధ్యక్షులు రాములు, రమేష్, బంజారా సంఘం నాయకులు సంగ్రాం, గణేష్, సర్దార్, సంతోష్, మున్సిపల్ మాజీ చైర్మెన్లు కుడుముల సత్యనారాయణ, పద్మ శ్రీకాంత్, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా, వినోద్‌గౌడ్, సామెల్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.
పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో
ప్రజలు సంతోషంగా ఉండాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): పెద్దమ్మతల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. మండలంలోని సజ్జన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణం, అభివృద్ధి కోసం తాను పూర్తి సహకారం అందజేస్తానన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బట్టు విఠల్, మండల అధ్యక్షుడు సాయికుమార్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రమేశ్, కార్యవర్గ సభ్యులు కిష్టయ్య, సిద్దిరాములు, పోచయ్య, సాయిలు, బాలయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.
ఇళ్లు మంజూరు కాని వారు
ఆందోళన చెందొద్దు
పలు చోట్ల తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమెల్యే మదన్‌మోహన్ రావు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తాం