అగ్రస్థానం! | - | Sakshi
Sakshi News home page

అగ్రస్థానం!

Aug 9 2025 5:57 AM | Updated on Aug 9 2025 5:57 AM

అగ్రస్థానం!

అగ్రస్థానం!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో

జుక్కల్‌ మండలం బంగారుపల్లిలో మక్తవార్‌ గంగవ్వ గృహ ప్రవేశం చేసిన ఇందిరమ్మ ఇల్లు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచింది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం నిరంతరం శ్రమించిన ఫలితంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర హౌజింగ్‌ కార్పొరేషన్‌ సెక్రెటరీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీపీ గౌతం.. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌తోపాటు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు కలిపి 12,090 ఇళ్లు కేటాయించగా, 11,818 ఇళ్లు మంజూరు చేశారు. 5,770 ఇళ్లు గ్రౌండింగ్‌ అవడంతోపాటు 2,342 ఇళ్లు బేస్మెంట్‌ పనులు పూర్తయ్యాయి. 157 ఇళ్ల గోడల పనులు కాగా, 75 ఇళ్లు రూఫ్‌ లెవల్‌కు చేరాయి. ఒక ఇంటి నిర్మాణం పూర్తయ్యింది. కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ క్షేత్ర స్థాయి పర్యటనల్లో భాగంగా ప్రతిరోజూ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయి. శ్రావణ మాసం పూర్త య్యేలోగా వందకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిపించాలనే లక్ష్యంతో అధికారులు అడుగులు వేస్తున్నారు.

ప్రతి రోజూ పురోగతి నివేదిక!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం అయ్యేలా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ రోజుకు ఒకటి రెండు మండలాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలోని నాలు గు నియోజకవర్గాల్లోని ఆయా మండలాల్లో పనులు వేగవంతం అయ్యేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలను పరిశీలించే క్రమంలో లబ్దిదారులతో మాట్లాడి ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతి రోజూ సాయంత్రం వరకు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పురోగతి పై నివేదిక తెప్పించుకుని, ఎక్కడైనా వెనుకబడి ఉంటే అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు.

స్వయం సహాయక రుణాలు

లబ్ధిదారులు సొంత డబ్బులు పెట్టుకుని మొదలుపెట్టాల్సి ఉంటుంది. బేస్మెంట్‌ వరకు పనులు అయి న తరువాత మొదటి బిల్లు ఖాతాలో జమవుతుంది. అయితే చాలా మంది చేతిలో డబ్బులు లేక ని ర్మాణానికి అవసరమైన సామగ్రి తెచ్చుకోలేకపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం తీసుకునే అవకాశం కల్పించింది. ఎస్‌హెచ్‌జీ రుణాల కోసం 970 మంది ఇందిరమ్మఽ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, 501 మంది వివరాలు బ్యాంకులకు చేరాయి. కాగా 439 మందికి ఇప్పటి వరకు రూ.5.13 కోట్లు మంజూరయ్యాయి. ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు ఇబ్బందులు తొలగిపోవడంతో పనుల్లో వేగం పెరుగుతోంది.

మరింత వేగంగా జరగాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం సంతోషం కలిగించింది. పనులు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నందున లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూసుకోవాలి. సామగ్రి కొరత తలెత్తకుండా, అలాగే బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఆశిష్‌ సంగ్వాన్‌, కలెక్టర్‌

నియోజక వర్గాల వారీగా..

రాష్ట్రంలోనే మొదటి స్థానంలో

నిలిచిన కామారెడ్డి జిల్లా

పురోగతిలో సగానికిపైగా

ఇళ్ల నిర్మాణాలు..

బంగారుపల్లిలో ఓ ఇంటి

నిర్మాణం పూర్తి

క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ

పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ సంగ్వాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement