
క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన
గాంధారి(ఎల్లారెడ్డి): పోతంగల్ కలాన్, గుజ్జుల్ తండా శివారులో బుధవారం క్షేత్రస్థాయిలో మొక్కజొ న్న, వరి పంటలను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. మొక్కజొన్నలో మొగి పురుగు, రసం పీల్చే పురుగు ఆశించినట్లు గుర్తించామన్నారు. ఈ పురుగుల నివారణకు హెమామెక్టిన్ బెంజాయిట్ 18.5 ఎస్‌జీ ఎకరానికి 200 గ్రాములు, క్లోరాంత్రనిప్రోల్ 100 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వరిలో టెట్రాసైక్లిన్, కాపర్ ఆక్సీక్లోరైడ్, స్టెప్రోసైక్లిన్ 600 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఎకరానికి 4 కి.గ్రా. పతేరా గుళికలు ఇసుకలో కలిపి చల్లాలని సూచించారు.
తాడ్వాయి మండలం దేవాయిపల్లిలో..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): దేవాయిపల్లి శివారులో పంటలను బుధవారం ఏవో నర్సింలు పరిశీలించారు. పంటల రక్షణలో రైతులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కజొన్న పంటలో అక్కడక్కడ కత్తెర పురుగు ఉధృతి అధికంగా ఉందని, దానికి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా స్ప్రే చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పైడి సంజీవరెడ్డి మొక్కజొన్న పంటలో నానో యూరియా, నానో పొటాష్‌ను డ్రోన్ ద్వారా పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏఈవో రమ్య, రమేష్‌రెడ్డి, రైతులు ఉన్నారు.

క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన