బాన్సువాడ కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ పోరు
బాన్సువాడ : బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం నిరసన గళం ఎత్తారు. పోలీసుల పహారాలో అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందుకు బాన్సువాడ శ్రీనివాస గార్డెన్ వేదికగా నిలిచింది. సమావేశానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహాన్‌రెడ్డి, కై లాస్ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాల అబ్జార్వర్లు వేణుగోపాల్ యాదవ్, సత్యనారాయణగౌడ్‌లు హాజరయ్యారు. ఈ కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. కానీ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గంలో ఉన్న పార్టీ మండల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్, సీనియర్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వలేదని ఆ వర్గం కార్యకర్తలు మార్కెట్ కమిటీలో సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల అధ్యక్షులకు ఈ విషయాన్ని తెలిపి మార్కెట్ కమిటీకి రావాలని ఏనుగు వర్గం సూచించారు. మానాల మోహాన్‌రెడ్డి, కై లాస్ శ్రీనివాస్‌లు నేరుగా శ్రీనివాస్‌గార్డెన్‌కు వచ్చారు. విషయం తెలుసుకున్న ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం నేతలు మార్కెట్ కమిటీ నుంచి నేరుగా శ్రీనివాస్ గార్డెన్‌కు వచ్చారు. గార్డెన్ వద్ద భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు ఏనుగు వర్గం నేతలు సమావేశానికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు గేటు ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీనియర్ నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం వద్దకు వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారు తమను అవమానిస్తున్నారని ఏనుగు వర్గం నేతలు ఆరోపించారు. చివరికి వారిని సముదాయించి పంపించేశారు.
మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం నిరసన
పోలీసుల పహారాలో కాంగ్రెస్
కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం


