రామారెడ్డి: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు మంగళవారం ఇసన్నపల్లి(రామారెడ్డి)లోని శ్రీకాలభైరవ స్వా మి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి మొదటిసారి వచ్చిన ఆయనకు సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకు లు, ఆలయ ఈవో ప్రభుగుప్తా తీర్థప్రసాదాల ను అందించారు. హరీశ్‌రావు వెంట మాజీ ఎంపీపీ దశరథ్‌రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సతీశ్ గుప్తా, నాయకులు సత్యంరావు, పడిగెల శ్రీనివాస్ తదితరులున్నారు.
అటవీ భూముల ఆక్రమణకు చెక్
లింగంపేట: అటవీ భూముల ఆక్రమణకు అధికారులు చెక్ పెడుతున్నారు. అటవీ ప్రాంతంలో చెట్లను నరికిన ప్రాంతాల్లో పొక్లెయిన్‌లతో కందకాలు తవ్విస్తున్నారు. బోనా ల్, మెంగారం శివారులోని అటవీ భూము లు ఆక్రమణకు గురవుతున్న వైనంపై ఇటీవల ‘సాక్షి’లో ‘అటవీ భూములు ఆన్యాక్రాంతం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో అటవీ భూముల ఆక్రమణలను నిరోధించడానికి అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్విస్తున్నారు. రెండు రోజులుగా సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, బీట్ ఆఫీసర్ పర్వీన్ పర్యవేక్షణలో కందకాల తవ్వకాలు కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంతంలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా రెండు మీటర్ల లోతు, రెండు మీటర్ల వెడల్పుతో కందకాలు తవ్విస్తున్నట్లు వారు తెలిపారు.
విద్యుత్ సమస్యలపై వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు
కామారెడ్డి అర్బన్: వినియోగదారులు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వి ద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ తెలిపా రు. వినియోగదారులు 79016 28348 నంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయగానే టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్‌కు స్వాగతం అని రిప్లై వస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఆప్షన్లను ఎంచుకుని తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చని వివరించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
సామర్థ్యాలను పెంపొందించాలి
కామారెడ్డి రూరల్: విద్యార్థుల్లో సామర్థ్యాల ను, విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని డీఈవో రాజు పేర్కొన్నారు. జిల్లాలోని 15 మండలాల ప్రధానోపాధ్యాయులకు మంగళవారం దేవునిపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఐదు రోజుల శిక్షణను డీఈవో ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు ప్రతి ఉపాధ్యాయుడి బోధన తీరును పరిశీలించాలన్నారు. స్టాఫ్‌లో సమన్వయం సాధించారు. అందరూ చక్కగా పనిచేసి విద్యాభివృద్ధికి పాటుపడాలని సూచించా రు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ గంగాకిషన్, కోఆర్డినేటర్ వేణు శర్మ, ఆర్పీలు సాయిరెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, అంజల్‌రెడ్డి పాల్గొన్నారు.
‘ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి’
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని గిగ్, ప్లాట్ ఫా రం వర్కర్స్ ఈ –శ్రమ్ పోర్టల్‌లో పేర్లను న మోదు చేసుకోవాలని జిల్లా సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్, కొరియర్ సర్వీసెస్, హోమ్ సర్వీసెస్, ఏసీ టెక్నిషియన్లు, గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, రాపి డో, ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గి, అర్బన్ కంపెనీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, లాజిస్టిక్స్, పో ర్టల్ లాజిస్టిక్స్ వంటి సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఈపీఎఫ్ లేనివారందరు పేర్లు న మోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ– శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికి కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ గుర్తింపు కార్డుతో పాటు శాఖ అమలు చేసే సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఇతర వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 14434 లో సంప్రదించాలని సూచించారు.
కాలభైరవుడి సేవలో హరీశ్‌రావు


