మేకుఎన్ ఐడియా సర్‌జీ!
బీబీపేట(కామారెడ్డి): కోతులు తమ సహజమైన చేష్టలతో కిష్కిందకాండ సృష్టిస్తుంటాయి. పంటలనుంచి ఇళ్ల వరకు అన్నింటికి నష్టం చేకూరుస్తుంటా యి. వాటి బాధ తప్పించుకోవడానికి ప్రజలు రకరకాల ఏర్పాట్లు చేసుకుంటుంటారు. కోతుల బాధ తప్పించుకోవడానికి బీబీపేటకు చెందిన నర్సింలు కొత్త ఆలోచన చేశాడు. ఆయన ఇంటికి డీటీహెచ్ కనెక్షన్ ఉంది. కోతులు తరచూ డిష్ యాంటెన్నాపైకి దూకుతుండడంతో సెట్టింగ్ పోతోంది. దీంతో రిపేర్ చేయించడానికి వందలాది రూపాయలు ఖ ర్చు అవుతున్నాయి. ఈ సమస్యనుంచి బయటపడ డానికి నర్సింలు ఓ ఆలోచన చేశాడు. డిష్ యంటె న్నా చుట్టూ సైకిల్ సైకిల్ టైర్ చుట్టి మేకులు కొట్టా డు. సిగ్నల్ రిసీవర్ వద్ద కూడా ఇలాగే చేశాడు. డిష్ మధ్యలోనూ మేకులు కొట్టాడు. కోతులు దూకితే మేకులు గుచ్చుకునేలా వాటిని అమర్చాడు. ఇది స త్ఫలితాలు ఇస్తోంది. కోతులతోపాటు రిపేర్ల బాధ తప్పిందని నర్సింలు పేర్కొంటున్నాడు.
కోతి చేష్టలకు మేకు విరుగుడు


