వర్షంతో రోడ్లన్నీ జలమయం
బాన్సువాడ/నిజాంసాగర్/నాగిరెడ్డిపేట/లింగంపేట/పెద్దకొడప్‌గల్ : జిల్లావ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాన్సువాడలో కురిసిన భారీ వర్షానికి ఎస్‌బీఐ బ్యాంకు ఎదురుగా భారీగా వర్షపు నీరు నిలిచింది. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తుంది. నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నీరు చేరడంతో ధాన్యం మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. లింగంపేట మండలంలో కురిసిన వర్షానికి పంట చేనుల్లో మడికట్లు నిండాయి. పెద్దకొడప్‌గల్ మండలంలో వర్షంతో లోతట్టు ప్రాంతాలన్ని నీటితో నిండిపోయాయి. రోడ్లపై గుంతలలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
రెండు రోజులుగా కురుస్తున్న వానలు
ఇబ్బందులు పడ్డ వాహనదారులు
వర్షంతో రోడ్లన్నీ జలమయం


