విద్యుత్ సింగిల్ విండో ఏర్పాటు
కామారెడ్డి అర్బన్: ఎన్‌పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు హై టెన్షన్ 11, 33 కేవీ ఆపై వోల్టేజీ సర్వీసుల మంజూరు సులభం, వేగవంతం చేసేందుకు సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎస్‌ఈ ఎన్ శ్రావణ్‌కుమార్ గురువారం తెలిపారు. హెచ్‌టీ 11 కేవీ ఆన్‌లైన్ దరఖాస్తులను ఏడీఈ కమర్షియల్, 33 కేవీ దరఖాస్తులను ఏడీఈ కమర్షియల్ కార్పొరేట్ పర్యవేక్షించి అన్ని పత్రాలు సరిగా ఉంటే రెండు రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలను రూపొందిస్తారని, మౌలిక వసతులు ఏర్పాటు చేసి అత్యంత వేగంగా సర్వీసు మంజూరు చేస్తారని ఎస్‌ఈ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాద
ఘటనాస్థలం పరిశీలన
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రం సమీపంలోని 161 జాతీయ రహదారిపై గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని గురువారం సీఐ నరేష్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో డాక్టర్ పండరి అనే వ్యక్తి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతిచెందాడు. దీంతో ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై మహేందర్, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుపై గుంతలో నిలుస్తున్న నీరు
మాచారెడ్డి : మండలంలోని గన్‌పూర్(ఎం) గ్రామంలో ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఈగుంతల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంందులు ఎదుర్కొంటున్నారు. ఏమరుపాటుతో వాహనాలు నడిపితే గుంతల్లో పడిపోయే ప్రమాదముందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇటీవల గన్‌పూర్ తండాకు చెందిన ఓ వాహనదారుడు గుంతలో పడగా స్వల్ప గాయాలైనట్టు గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
సైనిక్ స్కూల్‌లో ప్రవేశానికి అర్హత సాధించిన రిషివంత్
కామారెడ్డి టౌన్: ఇండి యా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష– 2025లో జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి లక్కాకుల రిషివంత్ ఉత్తీర్ణత సాధించాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు రిషివంత్‌కు అభినందలు తెలిపారు.
విద్యుత్ సింగిల్ విండో ఏర్పాటు
విద్యుత్ సింగిల్ విండో ఏర్పాటు


