రెండో రోజూ దంచికొట్టిన వాన
నర్వ గేటు వద్ద కుండపోతగా కురుస్తున్న వర్షం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తుపాన్ ప్రభావంతో జిల్లా అంతటా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ సారి రుతుపవనాలు ముందుగానే వస్తున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి తోడు తుపాన్ ప్రభావం కూడా కలిసిరావడంతో వర్షాలు దంచికొడుతున్నాయి. నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. హసాన్‌పల్లిలో తడిసిన ధాన్యం మొలకెత్తింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పల చుట్టూ వర్షపు నీరు నిలిచింది. బాన్సువాడ పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ చెరువును తలపించింది.
చెరువులను తలపించిన రోడ్లు
జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. వర్షాకాలం సీజన్ రాకముందే నాలాలు, డ్రెయినేజీలు శుభ్రం చేయించాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయి చెరవులను తలపించాయి. విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీ, కాకతీయనగర్, నిజాంసాగర్ రోడ్డు, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
రెండో రోజూ దంచికొట్టిన వాన
రెండో రోజూ దంచికొట్టిన వాన


