
‘దేశం కోసం ఓ బిడ్డను ఇవ్వాలి’
కామారెడ్డి అర్బన్: ప్రతి హిందూ కుటుంబం ఐదు గురు పిల్లలను కనాలని, దేశం కోసం ధర్మం కోసం ఓ బిడ్డను ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. పాతరాజంపేట ఆర్ష గురుకులంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఆర్య వీర్‌దళ్ యువ నిర్మాణ శిబిరం ఆదివారం ముగిసింది. కా ర్యక్రమంలో రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ప్రతికుటుంబం ఒక బిడ్డను ఇవ్వకుంటే కష్టపడి సంపాదించిన సంపదను ఉగ్రవాదులకు అప్పగించాల్సి వస్తుందని హెచ్చరించారు. హిందువులు ఇంకా సెక్యులర్ మంత్రం జపిస్తే మిగిలేది ఏ మీ ఉండదన్నారు. హిందువుల నాశనం కోరుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో బుద్ధిచెప్పాలన్నారు. చక్కని విద్యనందిస్తున్న ఆర్ష గురుకులాల్లో పిల్లల ను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ముగింపు సభలో విద్యార్థులు చేసిన కర్రసాము, కత్తిసాము విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీసీ బీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, ఆర్ష గురుకులం అధి పతి బ్రహ్మానంద సరస్వతి, ఆర్య సమాజం ప్రతినిధులు బాజన్న, వేదమిత్ర వేదార్థి ఆర్య, హరిదాస్ ఆర్య, ఆచార్య సందీప్ ఆర్య, శైలేష్‌కుమార్, కనిష్క, రాంనివాస్, ఆచార్య నరేందర్ ఆర్య పాల్గొన్నారు.