వర్షంతో నిలిచిన మురుగు
● బిచ్కుందలో దుకాణాల్లోకి చేరిన నీరు
● పూడుకుపోయిన కాలువలు
బిచ్కుంద/దోమకొండ: : బిచ్కుందలో రోడ్డు వెడల్పు పనులలో భాగంగా రెండు వైపుల మురికి కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయకుండా వదిలేయడంతో వర్షం నీరు రోడ్డుపై నిలిచింది. దీంతో మురుగు నీరు దుకాణాల్లోకి చేరింది. మోకాళ్ల వరకు నీరు నిలవడంతో ప్రజలు, వాహదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోకపోవడంతో కాలువల పనులు ముందుకు సాగడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
దోమకొండ మండల కేంద్రంతో పాటు ముత్యంపేట, చింతమాన్‌పల్లి, సంఘమేశ్వర్, లింగుపల్లి, అంబారిపేట, అంచనూరు, సీతారంపల్లి గ్రామాల్లో వర్షం కురిసింది. మండల కేంద్రంలోని శివరాంమందిర్ ఆలయ ప్రాంగణం వర్షపునీటితో నిండిపొయింది. బీబీపేట రోడ్డులో వర్షపునీరు రోడ్డుపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షంతో నిలిచిన మురుగు


