ఎన్‌డీసీసీబీ చరిత్రలో ఘన విజయం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌డీసీసీబీ చరిత్రలో ఘన విజయం

Apr 2 2025 1:35 AM | Updated on Apr 2 2025 1:35 AM

ఎన్‌డీసీసీబీ చరిత్రలో ఘన విజయం

ఎన్‌డీసీసీబీ చరిత్రలో ఘన విజయం

ఎల్‌ఆర్‌ఎస్‌కు నామమాత్రపు స్పందన

మూడు బల్దియాలలో కలిపి 17,293 దరఖాస్తులు

ఫీజు చెల్లించినవారు 3,719 మంది

ముగిసిన 25 శాతం రాయితీ గడువు

కామారెడ్డి టౌన్‌ : అక్రమ లేఅవుట్‌లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడం కోసం ప్రభుత్వం 25 శాతం రాయితీతో ఇచ్చిన అవకాశానికి దరఖాస్తుదారులనుంచి స్పందన కరువయ్యింది. గత నెలాఖరుతో ఈ గడువు ముగియగా.. జిల్లా లోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 21.50 శాతం దరఖాస్తుదారులు మాత్రమే పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మూడు మున్సిపాలిటీలలో కలిపి 17,293 దరఖాస్తులు రాగా.. 3,719 మంది ఫీజు చెల్లించి రాయితీని వినియోగించుకున్నారు. వీరి దరఖాస్తులను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు బుధవారంనుంచి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం క్రమబద్ధీకరణ ప్రక్రియ ను పూర్తి చేస్తారు. దరఖాస్తు తిరస్కరణకు గురై తే చెల్లించిన ఫీజులో 90 శాతం తిరిగి దరఖాస్తుదారుడి ఖాతాలో జమచేస్తారు.

మండలాల్లో 20 శాతమే..

ఎల్‌ఆర్‌ఎస్‌ –2020 కి సంబంధించి మండలాల్లోనూ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలు మినహా 22 మండలాలలో 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు 14,012 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 12,357 దరఖాస్తులను ఆమోదించారు. గతనెలాఖరులోగా 2,472 మంది దరఖాస్తుదారులు మాత్రమే స్పందించి ఫీజు చెల్లించారు. ఇంకా 9,885 మంది దరఖాస్తుదారులు స్పందించలేదు.

మున్సిపాలిటీలవారీగా దరఖాస్తుల వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement