సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం
బాన్సువాడ : రేషన్ షాప్‌ల ద్వారా ఉచితంగా స న్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బాన్సువాడ స హకార సంఘంలోని రేషన్ దుకాణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పట్టణంలోని పేదలకు 1,400 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజురు చేశా మని, వెయ్యి ఇళ్లు కట్టించి ఇచ్చామని పేర్కొ న్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైంద ని, ఇంకా పేదలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో మల్లికార్జున్, సహకార సంఘం అ ధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొల్లూర్‌లో..
బాన్సువాడ రూరల్ : కొల్లూర్‌లో మంగళవారం సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కిరణ్మయి, డీఎస్‌వో మల్లికార్జున్, తహసీల్దార్ వరప్రసాద్, నాయకులు పోతారెడ్డి, రెంజర్ల సాయిలు, జనార్దన్‌రెడ్డి, రాచప్ప, మొగులయ్య, దుర్గారెడ్డి, సాయిలు పాల్గొన్నారు.
వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి


