ఎల్లారెడ్డి: క్షేత్ర పర్యటనలతో విద్యార్థులలో మానసిక వికాసం పెంపొందుతుందని పీఎం శ్రీమోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తోట గాంధీ అన్నారు. గురువారం స్కూల్ విద్యార్థులు రుద్రూర్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు హరీష్, కృష్ణప్రసాద్‌లు విద్యార్థులకు పంటలు సాగు చేసే విధానం, భూముల సారవంతం, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. మొక్కలను అంటు కట్టే విధానం, సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యారమణ, బల్వంత్‌రావు తదితరులున్నారు.
మెట్ల బావిని సందర్శించిన విద్యార్థులు
లింగంపేట/కామారెడ్డి రూరల్: మండల కేంద్రంలోని నాగన్నగారి మెట్ల బావిని గురువారం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ)లో భాగంగా నాగన్నగారి మెట్ల బావిని, మెదక్ చర్చి, ఏడుపాయల దుర్గా భవాని ఆలయాలను సందర్శించినట్లు తెలిపారు. నాగన్నగారి బావి విశిష్ఠతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల క్షేత్ర పర్యటన


