గాంధారి(ఎల్లారెడ్డి) : వేసవిలో నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా పెంచాలని డీపీవో, మండల ప్రత్యేకాధికారి మురళి సూచించారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను కాపాడాలన్నా రు. మంగళవారం ఆయన మండలంలోని నాగ్లూర్, నేరల్, నేరల్ తండా, చద్మల్, చద్మల్ తండా, బీర్మల్ తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్సరీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కంపోస్ట్‌షెడ్డులను పరిశీలించారు. తాగు నీటి ఎద్దడి రాకుండా చూడాలని, శానిటేషన్ బాగా చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జీపీ కార్యదర్శులకు సూచనలు ఇవ్వాలని ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణలకు సూచించారు. ఆయన వెంట కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.
● తాగు నీటి ఎద్దడి రాకుండా చూడాలి
● డీపీవో మురళి