బాన్సువాడ : మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించారని, అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చేవేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్‌కు కేటాయించి 10 శాతం స్థలాలను మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని, ఖాళీ స్థలాలకు ఇళ్ల స్థలాలు కేటాయించారని ఆరోపించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి, సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్, మజ్జిగ శ్రీనివాస్, హరి, సాయికిరణ్, లక్ష్మినారాయణ, కోనాల గంగారెడ్డి, శేఖర్‌గౌడ్, హన్మండ్లు తదితరులు ఉన్నారు.