పాల్వంచ మండలం ఫరీదుపేటకు చెందిన యెంకోళ్ల మంజుల భర్తతో కలిసి కూరగాయలు సాగు చేయ డం ద్వారా కొంతకాలం ఉపాధి పొందారు. తర్వాత గ్రామంలో బ్యాంగిల్ స్టోర్ ఏర్పాటు చేశారు. దుస్తులు కుడుతున్నారు. ఆసక్తిగలవారికి దుస్తులు కుట్టడంతో శిక్షణ కూడా ఇస్తున్నారు. షాప్ ఏర్పాటు కోసం మహిళా సంఘం నుంచి రూ. 9 లక్షల అప్ప తీసుకున్నానని మంజుల తెలిపారు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో అప్పు తీరుస్తున్నామన్నారు. ఇంకా రూ. 2.46 లక్షల అప్పు ఉందన్నారు. వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.