● డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి
సుభాష్‌నగర్: ఎన్‌డీసీసీబీని రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపేలా సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, సొసైటీ చైర్మన్లు కృషి చేయాలని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి అన్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం ఉన్న ఎన్‌పీఏ 8.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాల యంలో శుక్రవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వ్యా పార కార్యకలాపాలు రూ.1800 కోట్ల నుంచి రూ. 2100 కోట్లకు పెరిగిన సందర్భంగా చైర్మన్ కేక్ కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఏ తగ్గింపునకు సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, సీఈవో నాగభూషణం వందే, డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల్ల నిర్మాణం ప్రారంభించాలి
బాన్సువాడ రూరల్: మండలంలోని నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని ఎంపీడీవో బషీరుద్దీన్ సూచించారు. శుక్రవారం డీఎల్‌పీవో సత్యనారాయణరెడ్డితో కలిసి నాగారం గ్రామంలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. నాయకులు వెంకట్రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నవీన్‌గౌడ్, సృజన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
8.5 శాతానికి తగ్గిన ఎన్‌పీఏ