సమావేశంలో మాట్లాడుతున్న
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: లే అవుట్‌లు, ప్లాట్ల అనుమతులకు సంబంధించిన నివేదికలను పూర్తి వివరాలతో అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం తెలంగా ణ బి–పాస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో లే అవుట్ లు, ప్లాట్లను సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి నివేదికలు అందజేయాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, నీటిపారుదల, మున్సిపల్, టౌన్ ప్లా నింగ్ తదితర శాఖల అధికారులు సంయుక్తంగా ప రిశీలన చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, రోడ్లు భవనాల శాఖ ఈఈ రవి శంకర్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, డీటీసీపీవో సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. తన చాంబర్‌లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టల్‌లలో నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.