● కొనసాగుతున్న సిద్దరామేశ్వరస్వామి
బ్రహ్మోత్సవాలు
భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మంగళవారం విమాన రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రతిష్టించి ఊరేగించారు. రథంను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. అంతకు ముందు ఆలయ పీఠాధిపతి సదాశివమహంత్ శ్రీసిద్దగిరి సమాధి వద్దకు వచ్చి అక్కడ రుద్రాకారుడిగా మారి పూజలు నిర్వహించారు. అర్చకులు సిద్దగిరిశర్మ, రామగిరిశర్మ, రాజేశ్వరశర్మ, సిద్ధేశ్‌ల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు అభిషేకాలను నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.