ఖలీల్‌వాడి: నగరంలో ని కంఠేశ్వర్‌లోని పాత సీఎస్‌ఐ స్కూల్‌లో సో మవారం ప్రమాదవ శాత్తు అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాలలో ని స్టోర్‌రూం నుంచి అ కస్మాత్తుగా మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసినట్లు అగ్నిమాపకశాఖ అధికారి నర్సింగ్‌రావు తెలిపారు.
పేకాడుతున్న నలుగురి అరెస్టు
మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.3338 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.