గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన భూమిని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారనీ, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన గంగాని చిన్న నర్సింలు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించాడు. అతను మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబరు 841 లో 2.37 ఎకరాల స్వంత భూమి ఉందన్నాడు. కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన కొందరు భూమి ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడటమే కాకుండా దాడులకు సైతం దిగుతున్నారని వాపోయాడు. చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.
– గంగాని చిన్న నర్సింలు, భవానీపేట, పాల్వంచ మండలం