మద్నూర్(జుక్కల్): హాస్టల్‌లో ఉండి చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర, బాలికల హాస్టల్‌లను శనివారం సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లోని అన్ని గదులను పరిశీలించి విద్యార్థులతో ఆమె మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. తాగునీరు, మరుగుదొడ్లు, హాస్టల్ ప్రాంతాలు బాగున్నాయా అని విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నా నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని వార్డెన్‌లను ఆదేశించారు. హాస్టల్‌లోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్డెన్‌లు, హాస్టల్‌లో పని చేసే సిబ్బంది స్థానికంగా ఉండి విద్యార్థులను చూసుకోవాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ ముజీబ్, సిబ్బంది ఉన్నారు.
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మద్నూర్‌లో హాస్టళ్ల తనిఖీ


