ప్రొఫెసర్‌ త్రివేణికి స్మారక సాహిత్య పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ త్రివేణికి స్మారక సాహిత్య పురస్కారం

Nov 15 2023 12:44 AM | Updated on Nov 15 2023 12:44 AM

పురస్కారం అందుకుంటున్న ఆచార్య త్రివేణి - Sakshi

పురస్కారం అందుకుంటున్న ఆచార్య త్రివేణి

తెయూ(డిచ్‌పల్లి): సాహితీ వేత్త, అనువాదకులు, సామాజిక ధృక్పథం కలిగిన నిజాం వెంకటేశం పేరుపై ప్రకటించిన మొదటి ‘స్మారక సాహిత్య పురస్కారం’ను తెయూ తెలుగు డీన్‌ ప్రొఫెసర్‌ వంగరి త్రివేణికి ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారంతో పాటు రూ.5వేల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక సాహితీవేత్త, తొలి బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, ఎ గంగారెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, కోడె పవన్‌ కుమార్‌, వింజమూరి సూర్య ప్రకాశ్‌, సీహెచ్‌వీ ప్రభాకర్‌రావు, వాడ్రేవు చినవీరభద్రం, పత్తిపాక మోహన్‌, చంద్రమోహన్‌, పలువురికి త్రివేణికి అభినందనలు తెలిపారు. నిజాం వెంకటేశం జయంతి రోజున మొదటిసారిగా ఐదుగురు సాహితీకారులకు ఈ పురస్కారాలను అందజేశారు. ఈ మేరకు త్రివేణి రాసిన ‘భరిణ‘ (సీ్త్రల సాహిత్య వ్యాససంపుటి) అనే పుస్తకానికి పురస్కారం అందజేశారు. అవార్డు గ్రహీత త్రివేణి స్పందిస్తూ.. మహోన్నత వ్యక్తి అయిన నిజాం వెంకటేశం పేరు మీద పొందిన ఈ స్మారక పురస్కారం తన రచనా వ్యాసంగంపై సామాజిక సాంస్కృతిక పరమైన నిబద్ధతను, బాధ్యతను పెంచిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement