● నేడే రెండో విడత పంచాయతీ పోరు
● పోలింగ్‌కు సర్వం సిద్ధం
● 149 పంచాయతీల్లో నిర్వహణ
బోట్ క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరుగనున్న పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు చేసింది. గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, పెదపూ డి, కాజులూరు, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో ఎన్నికల నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పో లింగ్ జరుగనుంది. ఇప్పటికే ఆయా మండల కేంద్రా ల్లో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. ప్రత్యేక బస్సుల ద్వారా సిబ్బందిని ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. శనివారం సాయంత్రానికే సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు.
అదనపు బలగాల ఏర్పాటు
రెండో విడతలో మొత్తం 149 గ్రామ పంచాయతీలు, 1,684 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 20 పంచాయతీలు, 444 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 1,768 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5,941 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. వీటిలో 391 సమస్యాత్మక, 323 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు.
కూటమి.. ప్రలోభాల పర్వం
రెండో విడత ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో కూటమి నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సర్పంచ్ స్థానాలను ఎలాగైనా కై వసం చేసుకునేందుకు గ్రామాల్లో నిత్యావసర సరుకులు, నగదు పంపిణీతో పాటు ఇతర తాయిలాలు అందిస్తున్నారు. ఎలాగైనా తమ మద్దతుదారులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారు. మొదటి విడత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడంతో రెండో విడతపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ విడతలోనూ అదే తరహా పోటీ కొనసాగుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆదివారం వెలువడే ఫలితాలతో తేలనుంది.


