పారదర్శకంగా పోలింగ్‌ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా పోలింగ్‌ చేపట్టాలి

Nov 29 2026 12:08 AM | Updated on Nov 29 2026 12:08 AM

కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ఆదేశం

పిఠాపురం రూరల్‌: రెండో విడత పంచాయతీ ఎన్నిక ల్లో భాగంగా పోలింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా ని ర్వహించాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అ న్నారు. పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పిఠాపురం పాలిటెక్నిక్‌ కళాశాల, గొల్ల ప్రోలు ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం చేపట్టా రు. గొల్లప్రోలు ఎంపీడీఓ కార్యాలయంలో పంపిణీ కేం ద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించా లని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మెప్మా పీడీ, గొల్లప్రోలు మండల రిటర్నింగ్‌ అధికారి పి.శైలజ పాల్గొన్నారు.

కొత్తపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హరేంధిర ప్రసాద్‌ పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

పిఠాపురం: స్థానికంగా ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ పరిశీలించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై సంబంధిత ఇంజినీరింగ్‌, పారిశ్రామిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) స్థాపనకు అనువైన వాతావరణం, వసతులు కల్పించడం ద్వారా స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు దోహదపడతాయని కలెక్టర్‌ వివరించారు. నిర్ణీత కాల పరిమితిలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం టిడ్కో గృహ సముదాయం వద్ద మహిళల జీవనోపాధుల పెంపు కోసం చేపట్టిన నూతన శిక్షణ భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన వెంటనే మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తామని అన్నారు. పాడా పీడీ శివరామ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement