మేయర్‌ పీఠం వైఎస్సార్‌ సీపీదే | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ పీఠం వైఎస్సార్‌ సీపీదే

Nov 27 2026 12:20 AM | Updated on Nov 27 2026 12:20 AM

● మాజీ మంత్రి కురసాల కన్నబాబు

● 66వ డివిజన్‌లో ఓటు వేసిన నేత

కాకినాడ రూరల్‌: నగర మేయర్‌ పీఠాన్ని వైఎస్సార్‌ సీపీ దక్కించుకోబోతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని 66వ డివిజన్‌లో తన సోదరుడు, సినీ దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్‌ సీపీ తరఫున జనరల్‌ ఏజెంట్‌గా వ్యవహరించిన కన్నబాబు.. మేయర్‌ అభ్యర్థి సత్యశ్రీతో కలిసి రూరల్‌లోని తొమ్మిదింటితో పాటు సిటీలోని పలు డివిజన్లను సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర ఓటర్లు చాలా తెలివైనవారని, ఉన్నత విద్యావంతులని వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలిచారని అన్నారు. పోలింగ్‌ సరళి చూస్తే నిశ్శబ్ద విప్లవంలా తమ మేయర్‌ అభ్యర్థి సత్యశ్రీకి సైలెంట్‌ ఓటింగ్‌ పడినట్లు అర్థమవుతోందని చెప్పారు.

వైఎస్సార్‌ సీపీలో చేరికలు

ప్రత్తిపాడు రూరల్‌: రాచపల్లి గ్రామానికి చెందిన పలువురు గురువారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. బంకు శ్రీను యూత్‌ ఆధ్వర్యాన వివిధ పార్టీలకు చెందిన 15 కుటుంబాల వారు జగన్‌కు జైకొట్టారు. వారికి పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముద్రగడ గిరిబాబు వైఎస్సార్‌ సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముత్యాల నూకరాజు, మేడిబోయిన బాబ్జీ, పెట్టిం సత్తిబాబు, మడికి చిట్టిబాబు, గింజాల వీరబాబు, పెట్టిం సురేష్‌, యాళ్ల ప్రకాష్‌, పెదిరెడ్డి వీరబాబు, పెదిరెడ్డి బాబ్జీ, సారిపల్లి వీరబాబు, ఈగల ఏసుబాబులకు గిరిబాబు కండువాలు వేసి, స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని, ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.

1,200 మంది

పోలీసులతో బందోబస్తు

సామర్లకోట: జిల్లాలో ఎన్నికలకు 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. వీరితోపాటు రూట్‌ మొబైల్‌ టీము, స్ట్రైకింగ్‌ ఫోర్సులను వినియోగించామని చెప్పారు. జి.మేడపాడు పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ముందు నుంచీ గ్రామీణుల్లో అవగాహన పెంచడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు సిబ్బంది పని చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఏబీజీ తిలక్‌, సీఐ ఎ.కృష్ణభగవాన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement