జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

తుని రూరల్‌: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన అంతర్‌ జిల్లాల అండర్‌– 14 బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీల్లో శ్రీప్రకాష్‌ విద్యా సంస్థలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గుమ్మడి స్తుతి కీర్తన అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయ్యింది. డిసెంబర్‌ 28 నుంచి జనవరి ఒకటి వరకు తెనాలిలో జరుగనున్న జాతీయస్థాయి అండర్‌– 14 హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు ఆమె ఎంపికై నట్టు ప్రిన్సిపాల్‌ ఎంవీవీఎస్‌ మూర్తి సోమవారం తెలిపారు. కీర్తనను శ్రీప్రకాష్‌ విద్యా సంస్థల అధినేత సీహెచ్‌ నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయప్రకాష్‌, హెచ్‌ఎం డీవీ శ్రీనివాస్‌, కోచ్‌లు జి.సురేష్‌, బాలరాజు, తల్లిదండ్రులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement