రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగి గ్రామానికి చెందిన మనపర్తి అశోక్ అమెరికాకు చెందిన డాక్టరకియాండ్రాను తన స్వగ్రామంలో ఆదివారం రాత్రి వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకను స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అశోక్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే క్లౌడ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ కియాండ్రా పరిచయం కావడంతో వివాహం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన యువకుడు ఉన్నత చదువులు చదివి అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో స్థిరపడటంతో ఈ ప్రాంతానికి చెందిన వారు అభినందనలు తెలిపారు. అలాగే అశోక్ హిందూ సంప్రదాయం పట్ల చూపిన గౌరవానికి అంతా ఆనందం వ్యక్తం చేసి, వధూవరులను ఆశీర్వదించారు.


