వైఎస్సార్‌ సీపీలోకి 32 కుటుంబాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి 32 కుటుంబాలు

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

వీఆర్‌పురం: పెద్దమట్టపల్లి పంచాయతీ రామపురంలో మాజీ సర్పంచ్‌ పిట్టా రామారావు, కోటం జయరాజు ఆధ్వర్యాన సీపీఎంకు చెందిన 32 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్‌ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా సీపీఎంలో ఉన్నామని, అయినా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేశారని, అందుకే వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు మక్కువ చూపామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు కలుముల రాముడు, లచ్చయ్య, వైఎస్సార్‌ సీపీ నాయకులు గుప్పెనపల్లి వీరస్వామి, ఉయిక నాగేశ్వరరావు, చిలకా హిరమరాజు, పూనెం రమేష్‌, బధం నాగేశ్వరరావు, దూలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement