న్యాయం అందించడంలో ఎంఎల్‌సీలు కీలకం | - | Sakshi
Sakshi News home page

న్యాయం అందించడంలో ఎంఎల్‌సీలు కీలకం

Nov 20 2026 12:13 AM | Updated on Nov 20 2026 12:13 AM

కాకినాడ క్రైం: బాధితులకు న్యాయం అందించడంలో మెడికో లీగల్‌ కేసుల (ఎంఎల్‌సీ) నిర్వహణ అత్యంత కీలకమని రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీతల ఫణికిరణ్‌ అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన వైద్యులకు, పోలీసులకు కాకినాడ జీజీహెచ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఎంఎల్‌సీ మేనేజ్‌మెంట్‌ వర్క్‌షాప్‌ గురువారం ముగిసింది. ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రయాగ ఉషాకిరణ్‌ ఆధ్వర్యాన డాక్టర్‌ ఫణికిరణ్‌, హెచ్‌ఓడీ డాక్టర్‌ పోతుల ఉమామహేశ్వరరావు సంయుక్త పర్యవేక్షణలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎంఎల్‌సీల ప్రాధాన్యాన్ని వివరించారు. బేసిక్‌ ఎంబీబీఎస్‌ చేసిన వారు పలు ఏరియా ఆసుపత్రుల్లో పోస్టుమార్టంలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్నిచోట్లా ఓకే తరహా విధానాలు అవలంబించడాన్ని వివరించారు. మెడ్లీ పీఆర్‌ యాప్‌లో వివరాల నమోదు, యాప్‌ వినియోగాన్ని బోధించారు. ఏ కేసుల్ని ఎంఎల్‌సీలుగా పరిగణించాలి, ఎటువంటి కేసుల్లో ఏయే భాగాలు సేకరించాలో చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించే వేళ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేసే విధానాన్ని వివరించారు. లైంగిక దోపిడి, మద్యపానం, గాయాల పరీక్షలు ఎలా చెయ్యాలి, నివేదికలు ఎలా ఇవ్వాలో తెలిపారు. న్యాయస్థానాల్లో సాక్ష్యాలను అందించే విధానంపై అవగాహన కల్పించారు. పోలీసు శాఖకు నోడల్‌ అధికారిగా పెద్దాపురం డీఎస్పీ తిలక్‌ వ్యవహరించారు. ఉమామహేశ్వరరావు, ఫణికిరణ్‌, ఎంఎల్‌సీ కేసుల స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ రాష్ట్ర నోడల్‌ అధికారి డాక్టర్‌ కొల్లపు సతీష్‌కుమార్‌, గైనకాలజీ ప్రొఫెసర్‌ విజయ షీల, ఫోరెన్సిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పూర్ణచంద్రరావు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉత్తమ్‌ కుమార్‌, రాజీవ్‌వర్మ శిక్షకులుగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement