తుపాను బాధితుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

తుపాను బాధితుల ధర్నా

Nov 20 2026 12:13 AM | Updated on Nov 20 2026 12:13 AM

అమలాపురం రూరల్‌: ఇటీవలి తీవ్ర తుపానుతో నష్టపోయిన వ్యవసాయ కార్మికులు, పేద కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ వ్యవసా య కార్మిక సంఘం ఆధ్వర్యాన బండారులంక అంబేద్కర్‌ నగర్‌లో బాధితులు గురువారం ధర్నా చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికుల కోసం గ్రామాల్లో తక్షణమే వీబీజీ రామ్‌జీ పనులు ప్రారంభించాలని, బాధిత పేద కుటుంబాలన్నింటికీ వెంటనే 50 కేజీల బియ్యం, 16 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని, ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కార్మిక, పేద కుటుంబానికి రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, కొబ్బరి చెట్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, పూర్తిగా లేదా పాక్షికంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని తహసీల్దార్‌ దివాకర్‌ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement