బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌టీయూ నాయకులు కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే, 58 సంవత్సరాలు పైబడిన ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి వెసులుబాటు కల్పించాలని, పని చేస్తున్న సమీప మండలంలో లేదా అదే నియోజకవర్గ పరిధిలోనే విధులు కేటాయించాలని, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు విధులు ముగిసిన అనంతరం అందరికీ ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని, ఎన్నికల విధుల రెమ్యూనరేషన్ చెల్లింపుల్లో అసమానతలను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి జి.రామ్‌తేజ, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మోర్త శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కుసుమంచి కాశీ విశ్వనాథ్, రాష్ట్ర కౌన్సిలర్ ఎన్‌ఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు
పటిష్ట భద్రత
కాకినాడ క్రైం: గ్రామ పంచాయతీలు, కాకినాడ నగ ర పాలక సంస్థ ఎన్నికల కు పటిష్ట భద్రత కల్పించాలని ఎస్పీ బిందుమాధవ్ పోలీసు అధికారుల ను ఆదేశించారు. కాకినా డలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పురోగతి, ఎన్నికల భద్రత ప్రధాన అంశాలుగా ఈ సమీక్ష కొనసాగింది. ప్రతి కేసులోనూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టి సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయంపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. మహిళలు, బాలికలపై చోటు చేసుకుంటున్న నేరాలను కట్టడి చేయాలన్నారు. దొంగతనాలను నియంత్రించి, రాత్రి నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, డయల్ 112 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పని తీరును అన్ని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచి, పెద్దాపురం, కాకినాడ డీఎస్పీలు కేవీవీ సత్యనారాయణ, తిలక్, ఎన్‌ఎస్‌వీకే దుర్గారావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


