వైఎస్సార్‌ సీపీలో చేరిన మాజీ సర్పంచ్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో చేరిన మాజీ సర్పంచ్‌

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

కొత్తపల్లి: జనసేన పార్టీకి చెందిన మత్స్యకార నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, ఉప్పాడ మాజీ సర్పంచ్‌ ఉమ్మిడి జాన్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. స్థానిక వైఎస్సార్‌ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మేరుగు యల్లాజీ ఆధ్వర్యాన శుక్రవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యురాలు వంగా గీత కండువా వేసి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయ అనుభవం ఉన్న జాన్‌ కుటుంబం గతంలో కొన్ని కారణాల వలన పార్టీలు మారినా తిరిగి వైఎస్‌ కుటుంబంపై ఉన్న అభిమానంతో వైఎస్సార్‌ సీపీలో చేరడం ఆహ్వానించదగిన విషయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఆన్‌లైన్‌ నాటకాన్ని తెర పైకి తెచ్చి, ప్రజలను మరోమారు నమ్మించి మోసం చేసిందని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేసిన పాపాన పోలేదన్నారు. కూటమి ప్రభ్తుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా మత్స్యకారులకు ఆయిల్‌ సబ్సిడీ, తుపాను సమయాల్లో పరిహారం అందించడంలో పూరిగా విఫలమైందని విమర్శించారు. అర్నబ్‌ తుపానుతో ఉప్పాడ, కోనపాపపేటల్లో మత్స్యకారుల ఇళ్లు, తీరంలో పాటు రోడ్లు కోతకు గురైతే పట్టించుకున్న వారే కరువయ్యారని దుయ్యబట్టారు. తుపాను సమయంలో వచ్చి ఎన్నికల ప్రచారం చేసి ప్రజలకు, మత్స్యకారులకు అబద్ధపు హామీలు ఇచ్చారని అన్నారు. తుపానులో దెబ్బ తిన్న మత్స్యకారుల బోట్లకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఇస్తామని, తీర ప్రాంతానికి శాశ్వత రక్షణ చర్యలు చేపడతామని, జనసేనకు ఓటు వేయకపోతే నిలుపుదల చేస్తామని బెదిరించారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు గుర్తింపు ఉంటుందని గీత భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్‌, ఎస్‌ఈసీ సభ్యులు రావు చిన్నారావు, వడిశెట్టి నారాయణరెడ్డి, రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ కార్యదర్శి జ్యోతుల బాబులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement