సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయండి

Nov 7 2026 12:12 AM | Updated on Nov 7 2026 12:12 AM

అన్నవరం: కార్తిక మాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పూర్తి సమాచారంతో కూడిన సైన్‌ బోర్డులను దేవస్థానంలో ఏర్పాటు చేయాలని దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఆదేశించారు. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘దారి చూపు స్వామీ ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. దేవస్థానంలో పలుచోట్ల సైన్‌ బోర్డులు లేకపోవడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. అదే విధంగా పోలవరం కాలువ నిర్మాణం కోసం జాతీయ రహదారిపై బెండపూడి వద్ద ఇరువైపులా ఫ్‌లైఓవర్లు నిర్మించినందున గిరిప్రదక్షిణ పుష్కర కాలువ రోడ్డుకు వెళ్లేందుకు గాను ఈ సారి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు పలు సమస్యలను ‘సాక్షి’ ప్రస్తావించింది. వీటిపై కమిషనర్‌ స్పందించారు. ఈఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కూడలిలో సైన్‌ బోర్డులు ఉండాలని ఆదేశించారు. గిరిప్రదక్షిణ రోడ్డు విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి రథం పుష్కర కాలువ రోడ్డులోకి వెళ్లేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement