అంతా ఫ్యాన్‌ గాలి కిందకే.. | - | Sakshi
Sakshi News home page

అంతా ఫ్యాన్‌ గాలి కిందకే..

Nov 1 2026 12:09 AM | Updated on Nov 1 2026 12:09 AM

ఫ వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు

ఫ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన కన్నబాబు

కాకినాడ రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ, జనసేనకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు ఆ పార్టీలను వీడి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. వారంతా ఫ్యాన్‌ గాలి కిందకు వస్తున్నారు. కాకినాడ రూరల్‌ కొవ్వూరు గ్రామానికి చెందిన మత్స్యకారుడు, 20 ఏళ్లకు పైబడి టీడీపీలో కీలక నాయకుడిగా పనిచేసిన పాలెపు భైరవస్వామి మాజీ మంత్రి కన్నబాబు సమక్షంలో శనివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. కొవ్వూరు ఎన్నికల ప్రచారంలో భైరవస్వామికి పార్టీ కండువాను వేసి వైఎస్సార్‌ సీపీలోకి కన్నబాబు ఆహ్వానించారు. వైఎస్సార్‌ సీపీకి మత్స్యకారులు అండగా ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు పబ్బినీడి రమేష్‌, పల్లంరాజు, ఊబా శ్రీను, పిల్లి చక్రరావు, బుజ్జిరాజు, మల్లాడి మల్లేశ్వరరావు పాల్గొన్నారు. అంతకు ముందు రమణయ్యపేట వైద్యనగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో తమ్మవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పోలవరం మత్స్యకార గ్రామానికి చెందిన నాయకులు, సుమారు 20 కుటుంబాలకు చెందిన యువకులు కన్నబాబు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిన పడపాల నరేంద్ర, వాడ్ర వీరబాబు, కర్రి సూరిబాబు, సింగినమల్ల సతీష్‌, కర్రి రాజు, రేవు సునీల్‌, పడాల రాజు, కేవీవీ సత్యనారాయణ, మైలపల్లి చిట్టిబాబు, కర్రి బూరయ్య, తదితరులను సాదరంగా ఆహ్వానించి కండువాలు వేశారు. రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని కన్నబాబు అన్నారు. గ్రామ మాజీ ఉప సర్పంచ్‌ గొల్లపల్లి దొరబాబు, వాడ్ర సింహాద్రి, కర్రి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement