గల్లంతైన ఏఎన్‌ఎం మృతి | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన ఏఎన్‌ఎం మృతి

Oct 31 2026 12:07 AM | Updated on Oct 31 2026 12:07 AM

కోరుకొండ/ సీతానగరం: కాలువలో గల్లంతైన ఏఎన్‌ఎం మృతి చెందింది. సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి నాగంపల్లి సచివాలయ ఏఎన్‌ఎంగా దేవీపట్నం మండలం ఇందుకూరుకు చెందిన కారం సత్యవతి(48) పని చేస్తోంది. ఈ నెల 28న నాగంపల్లిలో విధులు నిర్వహించిన అనంతరం భర్తతో కలసి స్వగ్రామం వెళ్లే సమయంలో కోరుకొండ మండలం కోటికేశవరం దగ్గరలో ఉన్న ఈనుకొండ కాలువ దాటుతుండగా ప్రమాదవశాత్తు ఏఎన్‌ఎం సత్యవతి గల్లంతైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు నల్లచెరువు సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన ఇందుకూరిపేటకు ఆమె మృతదేహాన్ని తరలించామని సీతానగరం పీహెచ్‌సీ వైద్యురాలు వి.భవాని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement