బోట్‌క్లబ్ (కాకినాడ): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రెహమాన్ ఖాన్‌ను వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. పార్టీ పటిష్టతకు చేసిన సేవలకు గుర్తించి తనకు పదవి వరించేందుకు సహకరించిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
వేగమే ఉసురు తీసింది
కోరుకొండ: అతి వేగమే ఉసురుతీసింది.. ఇద్దరి మృతికి కారణమైంది. వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కోరుకొండ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ఆర్.శివాజీ కథనం ప్రకారం.. రంగంపేట మండలం ఈలకొలను గ్రామానికి చెందిన నలుగురు ఆటోలో గోక వరం మండలం కృష్ణునిపాలెం వెళ్లారు. తిరిగి అదే ఆటోలో వస్తుండగా స్థానిక గుర్రాల బొమ్మల వెంచర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పల్లేటి అనీల్‌కుమార్ (22), ఆటోలోని ప్రయాణికుడు అంచూరి చిన్నరాజు (40) తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఆటోలోని బెతుకూరి సుమలత, బెతుకూరి నాగేశ్వరరావు, బెతుకూరి మరియమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ అనీల్‌కుమార్ తండ్రి చిన్నవెంకన్న ఇచ్చిన ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై శివాజీ తెలిపారు. సంఘటనా స్థలాన్ని కోరుకొండ సీఐ ఎస్‌వీవీఎస్ మూ ర్తి, ఎస్సై ఆర్.శివాజీ పరిశీలించారు. లారీ వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని వారు వెల్లడించారు.


